ములుగు/ఏటూరునాగారం: నేటి(సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.దివాకర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని తెలిపారు. ఎన్నికల అనంతరం యధావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. అదే విధంగా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో నేటి గిరిజన దర్బార్ రద్దు చేసినట్లు పీఓ చిత్రామిశ్రా ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రద్దు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment