
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
గోవిందరావుపేట: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క కోరారు. మండల పరిధిలోని చల్వాయి పీఎస్‌ఆర్ గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయడంతో పాటు సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ప్రభుత్వం అందించిందని తెలిపారు. అదే విధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా సంవత్సరానికి రూ.12వేలు అందిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి ఇళ్లు ఇస్తుందని వివరించారు. కార్యకర్తలు సమన్వయంతో ముందుకెళ్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మల్లాది రాంరెడ్డి, వంగ రవియాదవ్, దాసరి సుధాకర్, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఇస్సార్ ఖాన్, పన్నాల ఎల్లారెడ్డి, రసుపుత్ సీతారాం నాయ క్, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మండల కేంద్రంలో అరుణోదయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి మాస్టర్స్ ఇన్విటేషన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలకు ఆదివారం బహుమతుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేసి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని తెలిపారు. అంతరించి పోతున్న క్రీడలను నేటి యువతకు పరిచ యం చేసిన ఘనత అరుణోదయ యూత్ క్లబ్ వారి దేనని తెలిపారు. నేటి యువకులు సెల్‌ఫోన్ల మత్తులో మునిగి తేలుతున్నారని వివరించారు. ఈ మండలం నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నా గ్రామాన్ని మరిచిపోకుండా ఏదో ఒకటి వినూత్నంగా చేస్తూ ఉండే సంస్కృతి ఉందన్నారు. నేటి యువతకు స్ఫూర్తిగా 45ఏళ్లు పైబడిన వారు బాల్ బ్యాడ్మింటన్‌లో పాల్గొనడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అశోక్, మండల పార్టీ అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, అరుణోదయ యూత్ క్లబ్ సభ్యులు, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
మంత్రి సీతక్క

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
Comments
Please login to add a commentAdd a comment