
జాతరలో భక్తులకు మెరుగైన వైద్యసేవలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మేడారం మినీ జాతరలో భక్తులకు మెరుగైన వైద్య సేవలందిస్తామని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. ఆదివారం మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. భక్తులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ కల్యాణ మండపం, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్ వైజంక్షన్, బయ్యక్కపేట గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఒక్కో వైద్యశిబిరానికి ప్రోగ్రాం ఆఫీసర్లను నియమించామన్నారు. ఈ నెల 12నుంచి 15వ తేదీ వరకు జాతరకు వచ్చే భక్తులకు వైద్యసేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు పవన్, రణధీర్, శ్రీకాంత్, చంద్రకాంత్, డీపీఎంఓ సంజీవరావు పాల్గొన్నారు.
జిల్లా మహాసభలను
విజయవంతం చేయాలి
ములుగు రూరల్: ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో నిర్వహించనున్న రైతుసంఘం జిల్లా ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఎండి అమ్జద్‌పాషా ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. రైతాంగ సమస్యల పరిష్కారంపై ఈ సభల్లో చర్చించనున్నట్లు వెల్లడించారు. ఈ మహాసభలకు రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి పాశం పద్మ హాజరుకానున్నట్లు వివరించారు.
నాణ్యత లోపించిన
వస్తువులు విషతుల్యం
ములుగు: నాణ్యత లోపించిన వస్తువులను కొనుగోలు చేసి వినియోగిస్తే విషతుల్యమయ్యే ప్రమాదం ఉందని వరల్డ్ కన్జ్యూమర్ రైట్ నేషనల్ డిప్యూటీ చైర్మన్ భూక్యా జంపన్ననాయక్ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల ఫోరం సమావేశం సంతోష్ అధ్యక్షతన ఆదివారం వరంగల్‌లో నిర్వహించగా వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లమస శ్రీకాంత్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని అన్నంపల్లికి చెందిన జంపన్న నాయక్‌ను కన్జ్యూమర్ రైట్ నేషనల్ డిప్యూటీ చైర్మన్‌గా నియమించి నియామక పత్రాన్ని అందించారు.
దాతల అసంతృప్తి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్ధానంలో జరిగిన మహాకుంభాభిషేక మహోత్సవంలో పలు రకాలుగా విరాళం ఇచ్చిన దాతలు పలువురు అసంతృప్తి చెందారు. ఆదివారం కుంభాభిషేకం ముగిసిన తరువాత కలశ దాతలు, ఇతర దాతలకు సన్మానం చేయాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన భక్తుడు మహేందర్ రూ.లక్ష విరాళంగా అందజేశారు. కనీసం అతని పేరు పిలవలేదని, సన్మానం చేయలేదని వాపోయాడు.

జాతరలో భక్తులకు మెరుగైన వైద్యసేవలు
Comments
Please login to add a commentAdd a comment