ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. ఉదయం, సాయంత్రం గంట సమయం ఉపాధ్యాయులు స్పెషల్ క్లాసులు బోధిస్తున్నారు. విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికతో ఉపాధ్యాయులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు సైతం ప్రభుత్వం అల్పాహారం అందిస్తోంది.
విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ
జిల్లాలోని పాఠశాలల్లో పదో తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణపై జిల్లా, రాష్ట కమిటీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిత్యం ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థుల ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment