
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
ఏటూరునాగారం: మార్చి 21వ తేదీ నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని షెడ్యూల్డ్ కులాల జిల్లా అభివృద్ధి అధికారి లక్ష్మణ్ నాయక్ అన్నారు. జిల్లాలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు పదోతరగతి పరీక్షలపై ప్రేరణ, శిక్షణ కార్యక్రమాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చిలో జరగబోయే టెన్త్ పరీక్షలు ఎలా రాయాలనే దానిపై ఇంగ్లిష్, తెలుగు, హిందీ, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. పరీక్షలకు ఇంకా 40రోజులే ఉన్నందున ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలను విద్యార్థులకు వివరించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం సాంబశివరావు, హెచ్‌డబ్ల్యూఓలు ప్రశాంత్, రేణుక, శ్రీనివాస్, ఓదెమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
షెడ్యూల్డ్ కులాల జిల్లా అభివృద్ధి అధికారి
లక్ష్మణ్‌నాయక్
Comments
Please login to add a commentAdd a comment