
నేతకానీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
ఏటూరునాగారం: నేతకాని కులస్తులకు ప్రత్యేక కేటగిరి కల్పించడంతో పాటు బడ్జెట్ కేటాయించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జాడి రాంబాబు అన్నారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కుల గణన వివరాల్లో ఎస్సీ నేతకాని సామాజిక వర్గం 1,33,000 జనాభా ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవంగా 18లక్షల పైచిలుకే జనాభా ఉంటుందని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి రీ సర్వే చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణలో ప్రత్యేక కోటాతో పాటు కేటగిరి కల్పించి బడ్జెట్ కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో బక్కయ్య, కాంతారావు, చంద్రబాబు, పోచయ్య, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడు జాడి రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment