
అక్రమాలపై విచారణ చేపట్టాలి
వెంకటాపురం(కె): వెంకటాపురం(కె) ఐసీడీఎస్ కార్యాలయం పరిధిలో అక్రమంగా బిల్లులు చేసిన వాటిపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాననాయకులు సోమవారం అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. చిన్నారులకు మెరుగైన విద్యను బోధించడంతో పాటు పౌష్టికాహారం అందించాలన్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్, డీడబ్ల్యూఓ 2023 నుంచి 2024 వరకు వెంకటాపురం ప్రాజెక్ట్ పరిధిలో చేసిన అక్రమ బిల్లులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు పర్శిక సతీష్, తాటి రాంబాబు, నాగరాజు, సురిటి నవదీప్, బొగ్గుల రాజ్‌కుమార్, సోర్లం మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
అడవుల సంరక్షణ
అందరి బాధ్యత
వాజేడు: అడవులను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని వాజేడు రేంజర్ చంద్రమౌళి అన్నారు. మండల పరిధిలోని కృష్ణాపురం, కోయవీరాపురం గ్రామాల్లోని ప్రజలకు అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులకు నిప్పుపెడితే జీవకోటికి ప్రమాదం ఉంటుందని తెలిపారు. అడవులు లేకపోతే సమస్త ప్రాణులకు ఆక్సిజన్ అందకపోవడంతో పాటు వర్షాలు కురవవని తెలిపారు. అదే విధంగా ఏడ్జర్లపల్లి బీట్‌లో ఎఫ్‌ఎస్‌ఓ నాగమణి ఆ గ్రామస్తులకు అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓలు నారాయణ, నాగమణి, భిక్షపతి, బీట్ ఆఫీసర్లు రాంమూర్తి, పున్నమయ్య, గంగా భవాని, పద్మ, ప్రసాదరావు, మనీషా తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి
బ్లాక్ లెవల్ స్పోర్ట్స్
ములుగు: నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో రేపటి(12వ తేదీ)నుంచి ములుగు బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించనున్నట్లు ఆ కేంద్రం వలంటీర్ నవీన్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 12, 13వ తేదీలలో యువకులకు కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్ పోటీలు ఉంటాయని వెల్లడించారు. వివరాలను నమోదు చేసుకోవడానికి ఫోన్ నంబర్ 9502126384, 9505496034లలో సంప్రదించాలని సూచించారు. విజేతలకు ఎలాంటి నగదు బహుమతి ఉండదని, ప్రశంస పత్రాలు, మెడల్స్ మాత్రమే అందిస్తామని వివరించారు.
తాడిచర్లలో
క్షుద్రపూజల కలకలం
మల్హర్: తాడిచర్ల శివారులోని తోళ్లపాయ వైపు.. పెద్దమ్మ గుడి, బీసీ కాలనీ పోయే మూడు బాటల వద్ద ఆదివారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేయడం కలకలం రేగింది. మూడు రోడ్లు కలిసే చోట నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో కూడిన ముద్దలు చేసి, గొర్రె పిల్లను బలిచ్చారు. క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురువుతున్నారు. ఈ ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు అటుగా వెళ్లడానికి భయపడుతున్నారు. మరి కొంతమంది రైతులు బిక్కుబిక్కుమంటూ వారి పనులకు వెళ్తున్నారు.
బొమ్మల కొలువు
భూపాలపల్లి అర్బన్: మంజూర్‌నగర్‌లోని ఇల్లందు లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి ఏరియాలో బొమ్మల కొలువు నిర్వహించారు. భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి దేవాలయం నమూనాతో ఏర్పాటు చేసిన బొ మ్మల కొలువు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి సీఎండీ సతీ మణి శారద బలరాం హాజరై సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్‌రెడ్డి, లేడీస్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు.

అక్రమాలపై విచారణ చేపట్టాలి

అక్రమాలపై విచారణ చేపట్టాలి
Comments
Please login to add a commentAdd a comment