
కామేశ్వరాలయ పనులు ప్రారంభం
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయం ఆవరణలోని కామేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కామేశ్వరాలయ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.11కోట్ల నిధులను మంజూరు చేయడంతో గత డిసెంబర్ నెలలో కేంద్ర పురావస్తుశాఖ అధికారులు ప్లేట్‌లోడ్ టెస్టును నిర్వహించి ఆలయ నిర్మాణం చేపడితే శిల్పాల బరువును భూమి ఎంతమేరకు తట్టుకుని నిలబడుతుందోనని పరీక్షలు నిర్వహించారు. ముందుగా కామేశ్వరాలయం చుట్టూ వాల్ నిర్మించేందుకు వారం రోజులుగా కందకం తవ్వకాలు చేపడుతున్నారు. రామప్పలో నిర్మించిన ఆలయాలు కేవలం ఇసుకనే పునాదిగా చేసి నిర్మించారు. కాలక్రమేణా ఇసుకను చీమలు తోడేస్తుండడంతో ఆలయం కుంగిపోయే ప్రమాదం ఉండడంతో ఆలయం చుట్టూ పది అడుగుల మేర కందకం తవ్వి రాయితో వాల్ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో భవిష్యత్తులో ఆలయ పునాదిలోకి చీమలు, ఎలుకలు వెళ్లి ఇసుకను తోడే ప్రమాదం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment