
ఐలాపూర్ పనులు త్వరగా పూర్తిచేయాలి
కన్నాయిగూడెం: ఐలాపూర్ సమ్మక్క–సారలమ్మ జాతర పనులను త్వరితగతిన పూర్తిచేసి జాతరను విజయవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి ఈజీఎస్ ఏపీడీ వెంకటనారాయణ అన్నారు. సోమవారం ఆయన అధికారులతో కలిసి ఐలాపుర్ సమ్మక్క గుడి ప్రాంగణంలో చేస్తున్న పనులను పరిశీలించారు. గద్దెల ప్రాంగణంలో చేస్తున్న శానిటేషన్ తో పాటు వివిధ పనులపై ఆరా తీశారు. వెంటనే పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో ఇంజనీరింగ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేకాధికారి డీఈ శరత్‌బాబు, తహసీల్దార్ వేణుగోపాల్, ఏపీఓలు సురేష్, సాజిత, ఆర్‌ఐ గణేశ్, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
– వివరాలు 8లోu
ఈజీఎస్ ఏపీడీ వెంకటనారాయణ
భద్రత.. భారీగా
జాతర విధులకు
వెయ్యి మంది సిబ్బంది
బుధవారం నుంచి ఆదివారం వరకు
కొనసాగనున్న భద్రత
Comments
Please login to add a commentAdd a comment