
జాతరకు వచ్చే భక్తులకు వైద్యసేవలు
ఏటూరునాగారం: కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల పరిధిలోని ఐలాపూర్, కొండా యి గ్రామాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి జరిగే జాతరలకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్ తెలిపారు. సోమవా రం ఐలాపూర్ జాతర కోసం ఆ గ్రామంలో ఏర్పా టు చేసిన కంటైనర్ అదనపు ఆరోగ్య ఉపకేంద్రం, కొండాయిలోని సబ్ సెంటర్లను క్రాంతికుమా ర్ వైద్యులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు కావాల్సిన వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయడంతో పాటు మందులు సైతం అందుబాటులో ఉంచామని తెలిపారు. గర్భి ణులు, రోగుల కోసం ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. అంబులెన్స్‌లను కూడా అందుబాటులో ఉంచామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి అభినవ్, ప్రణీత్‌కుమార్, ఎన్‌హెల్త్ మిషన్ మేనేజర్ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్

జాతరకు వచ్చే భక్తులకు వైద్యసేవలు
Comments
Please login to add a commentAdd a comment