
ఓటర్లు@2,45,015
ములుగు: జిల్లాలోని 10 మండలాల్లో 10 జెడ్పీటీసీ స్థానాలు, 87 ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటర్ల వివరాలను మంగళవారం రాత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ అథారిటీ ఆఫీసర్ సంపత్‌రావు వివరాలను వెల్లడించారు. జిల్లాలో 400వరకు ఓటర్లు కలిగిన పోలింగ్ స్టేషన్లు 117, 400నుంచి 500మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు 165, 501 నుంచి 750 మంది వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలు 210గా గుర్తించగా మొత్తం 492 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 2,45,015 మంది ఓటర్లు ఉండగా 1,18,572 మంది పురుషులు, 1,26,418 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 25 మంది ఉన్నారు.
మండలాల వారీగా ఓటర్ల వివరాలు
మండలం ఎంపీటీసీ పోలింగ్ మొత్తం
స్థానాలు కేంద్రాలు ఓటర్లు
ములుగు 13 73 38,910
మల్లంపల్లి 5 25 13,462
వెంకటాపురం(ఎం) 9 58 28,350
గోవిందరావుపేట 9 64 25,490
ఎస్‌ఎస్‌తాడ్వాయి 7 38 18,389
ఏటూరునాగారం 9 41 24,590
మంగపేట 14 77 39,689
వాజేడు 7 41 19,411
కన్నాయిగూడెం 5 21 9,943
వెంకటాపురం(కె) 9 54 26,781
మొత్తం 87 492 2,45,015
వివరాలు వెల్లడించిన
అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్
అథారిటీ ఆఫీసర్ సంపత్‌రావు
Comments
Please login to add a commentAdd a comment