
భక్తులకు పౌష్టికాహారం పంపిణీ
ఏటూరునాగారం: ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని మేడారం గ్రామంలో ఈనెల 12 నుంచి 15 వరకు జరిగే మినీ మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు సీడీపీఓ ప్రేమలత తెలిపారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో మంగళవారం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందితో 6నెలల నుంచి ఆరేళ్ల బాల బాలికలకు, గర్భిణులు, బాలింతలకు బాలామృతం, స్కాక్స్, బాదంపాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు మేడారానికి తల్లిదండ్రులతో వెళ్లే చిన్నారులు జాతరలో నీరసానికి గురికాకుండా ఈ పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మేడారంతో పాటు ఐలాపూర్‌లో ఏర్పాటు చేసిన జాతరలో తప్పిపోయిన భక్తులను పునరావాస కేంద్రాల వద్దకు చేర్చి బంధువులకు సమాచారం చేరవేసే విధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ ఆఫ్రీన్, పుష్పలతతో పాటు చైల్డ్ హెల్ప్‌లైన్ చంటి, అంగన్‌వాడీ టీచర్లు భవాని, లలిత, ఆయాలు పాల్గొన్నారు.
సీడీపీఓ ప్రేమలత
Comments
Please login to add a commentAdd a comment