రైతులకు ‘భరోసా’
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. ఈ మేరకు భూ భారతిలో నమోదైన వ్యవసాయ పంటసాగుకు యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం అందుతుందని ప్రకటించింది. డైరెక్టర్ బెనిఫిషరి ట్రాన్స్‌ఫర్(డీబీటీ) విధానంలో భాగంగా రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. ఈ మేరకు ఎకరాకు రూ.12వేల చొప్పున రెండు దఫాలుగా రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ మేరకు మొదటి దఫా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది.
జిల్లాలో 33,280 మందికి భరోసా
జిల్లాలోని 10మండలాల్లో రైతు భరోసా కింద 33,280 మంది రైతుల ఖాతాల్లో రూ.23.54 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. దీంతో రైతులకు కష్టకాలంలో ఈ డబ్బులు పంటల పెట్టుబడికి చేదోడువాదోడుగా నిలిచాయి. మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు ప్రభుత్వం ఇప్పటికే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నగదు జమ చేసింది. ఆపై భూమి ఉన్న వారికి రైతు భరోసా అందుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
మండలాల వారీగా రైతు భరోసా వివరాలు
మండలం రైతుల నగదు జమ
సంఖ్య రూ.లక్షల్లో
ఏటూరునాగారం 2,786 రూ.17.65
గోవిందరావుపేట 3,157 రూ.26.31
కన్నాయిగూడెం 1,736 రూ.11.04
మంగపేట 2,879 రూ.26.36
ఎస్‌ఎస్ తాడ్వాయి 1,616 రూ.11.13
వాజేడు 2,629 రూ.13.39
ములుగు 9,058 రూ.57.05
వెంకటాపురం(కె) 6,879 రూ.58.29
వెంకటాపురం(ఎం) 2,540 రూ. 14.14
మూడు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ
ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
రైతులకు ‘భరోసా’
Comments
Please login to add a commentAdd a comment