అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు
ములుగు రూరల్: పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డీఓ వెంకటేశ్వర్లకు ఆయన వినతిపత్రం అందించి మాట్లాడారు. సీసీఐ ద్వారా ఎకరా పట్టా భూమి ఉన్న రైతుకు 12 క్వింటాలు అమ్ముకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు ధ్రువీకరణ పత్రాల ద్వారా కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. దళారులు ఎకరం ఉన్న రైతులకు 10ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి మార్కెట్‌శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. విజిలెన్స్ అధికారులచే విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీంద్రచారి, కృష్ణాకర్, నాగరాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
మూడు రోజులుగా
భక్తులకు సేవలు
ఏటూరునాగారం: మండల పరిధిలోని బస్టాండ్ ప్రాంతంలో మేడారం జాతరకు వెళ్లే భక్తులు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిస ప్రత్యేక శిబిరంలో మూడు రోజుల పాటు ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు సీడీపీఓ ప్రేమలత తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సీడీపీఓ ఆర్టీసీ బస్టాండ్‌లోని క్యాంప్‌లో చిన్నారులకు బాదంపాలు, స్నాక్స్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భక్తులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు టీచర్లు, ఆయాలు పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు గ్రూపులుగా సేవలు అందజేశారన్నారు. అంతేకాకుండా ఎవరు కూడా అనారోగ్య బారిన పడకుండా తగు సూచనలు, సలహాలను ఇచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు లలితకుమారి, భవాని, ఆయాలు రోజా, దీనమ్మ, నాగమణి, వెంకటరమణ, జ్యోతి, సరోజన, స్వరూప, శకుంతల తదితరులు పాల్గొన్నారు.
కోడిగుడ్లు, రాగిజావ
అందించడం సాధ్యంకాదు
వెంకటాపురం(కె): మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు, రాగి జావ అందించడం సాధ్యం కాదని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. యూనియన్ మండల కమిటీ సమావేశాన్ని కుడుముల సమ్మక్క అధ్యక్షతన శుక్రవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో వంటలు చేస్తున్న కార్మికుల బతుకులు దుర్భరంగా ఉన్నాయన్నారు. మార్కెట్ ధరలకు, ప్రభుత్వం ఇస్తున్న మెనూ చార్జీలకు పొంతన లేదన్నారు. ఈ కారణంగానే కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరగతితో సంబంధం లేకుండా ప్రతీ విద్యార్థికి రూ.25 చెల్లించాలన్నారు. చిన్నా, చితక కారణాలను చూపుతూ 24ఏళ్ల సర్వీసు ఉన్న వంట కార్మికులను తొలగించకుండా జీవో విడుదల చేయాలన్నారు. అల్పాహారం బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు.
అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు
అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు
Comments
Please login to add a commentAdd a comment