జాతరలో సకల సౌకర్యాలు
కన్నాయిగూడెం: మండల పరిధిలోని ఐలాపూర్‌లో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మ జాతరలో సకల సౌకర్యాలు కల్పించినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు మంత్రి సీతక్క ఐలాపూర్ జాతరకు శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలతో చేరుకుని మేకపోతుతో మొక్కు సమర్పించుకున్నారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో ఐలాపూర్ జాతరకు నిధులు సరిగా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జాతరకు రూ.85లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. జాతరలో రోడ్లు, విద్యుత్, తాగునీరు, గుడి ప్రాంగణంలో జాలి కంచె ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అప్సర్ పాషా, మండల ఇన్‌చార్జ్ జాడి రాంబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న నాయకులు ప్లీ భాస్కర్, తిరుపతి, సురేష్, రాంబాబు పాల్గొన్నారు.
ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని అంబేడ్కర్ నగర్ కాలనీలో ఈనెల 26న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొమురవెల్లి మల్లన్న ఆలయ నిర్మాణ కమిటీ వ్యవస్థాపకులు గోగు మల్లయ్యజ్యోతి, కొమురవెల్లి మల్లన్న పట్నాల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను శుక్రవారం ఐలాపూర్‌లో మంత్రి సీతక్క ఆవిష్కరించారు. కల్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
మంత్రి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment