నైపుణ్యంతోనే గుర్తింపు
ఏటూరునాగారం: జూట్ బ్యాగుల తయారీ శిక్షణలో నైపుణ్యం ప్రదర్శించినప్పుడే గుర్తింపు వస్తుందని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. ఐటీడీఏ, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం(ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో 13 రోజుల పాటు జూట్‌బ్యాగుల శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం ట్రైనింగ్ సెంటర్‌ను పీఓ సందర్శించి అభ్యర్థులతో మాట్లాడారు. ఆసక్తితో ఇష్టంగా జూట్ బ్యాగులు, ఇతర తయారీ వస్తువులపై దృష్టి పెట్టి ఆర్థికంగా ఎదగాలన్నారు. 35మంది గిరిజన మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ శిక్షణని చక్కగా వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. వీరికి సర్టిఫికెట్లు అందజేసిన తర్వాత స్వయం ఉపాధి పొందే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ సురేష్‌బాబు, జేడీఎం కొండల్‌రావు, ట్రైనర్ తౌటినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
Comments
Please login to add a commentAdd a comment