సెట్టు రూ.13వేల వరకు..
శివసత్తులు, పోతరాజులు, భక్తులు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువులు 10–12 రకాలను ఒక సెట్టుగా విక్రయిస్తారు. అవసరాలను బట్టి విడివిడిగా కూడా అమ్ముతారు. ఒక సెట్టులో ఎల్లమ్మ గవ్వలు, ఈరకోల, ఢమరుకం, వల, ప్రతిమలు, కాళ్ల గజ్జలు, తౌతులు, శూలం, గొంగళి, కుల్ల(గవ్వల టోపీ), నిలువు ప్యాంట్లు ఉంటాయి. నాణ్యతను బట్టి ఈ సెట్టును రూ.6వేల నుంచి రూ.13 వేల వరకు విక్రయిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మరింత ఆకర్షించేలా మెషిన్ ఎంబ్రాయిడరీతో గజ్జెల లాగుల తయారీ వస్త్రాలపై దేవతల నమూనాలను కూడా వేస్తున్నారు. పూజకు కావాల్సిన ప్రతీ సామగ్రి ఇక్కడ లభిస్తుండడంతో జాతరల సీజన్‌లో వివిధ ప్రాంతాల భక్తులు నడికూడ బాట పడుతున్నారు.
ఎల్లమ్మ
గవ్వల బుట్ట
Comments
Please login to add a commentAdd a comment