భూపాలపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భూపాలపల్లి ఏరియాకు చెందిన సింగరేణి కార్మికుడు పూజారి అనిల్(31) మృతిచెందాడు. మంచిర్యాలలో వివాహ వేడుకకు పట్టణానికి చెందిన నలుగురు కారులో వెళ్లివస్తున్నారు. ఈ క్రమంలో కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అనిల్ ఏరియాలోని కేటీకే 5వ గనిలో జనరల్ మజ్ధూర్‌గా పని చేస్తున్నారు. అదే గనిలో పని చేస్తున్న మరో ముగ్గురు అండర్ మేనేజర్లు రాము, సంజయ్, దేవేందర్‌లకు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment