తప్పిపోయిన చిన్నారి అప్పగింత
ఎస్‌ఎస్ తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం మేడారానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. నర్సంపేటకు చెందిన రాజు తన కుటుంబ సభ్యులతో దర్శనానికి రాగా తన కుమార్తె హఫియా తప్పిపోయింది. ఈ విషయాన్ని రాజు వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అప్రమత్తమైన వాకీటాకీల ద్వారా సమన్వయంతో చిన్నారి అచూకీ కనుగొన్నారు. డీఎస్పీ రవీందర్ సమక్షంలో హఫియాను తల్లిదండ్రులకు అప్పగించారు. తన కుమార్తె సురక్షితంగా తమకు అప్పగించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
ఏటూరునాగారం: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఏటూరునాగారం గ్రామానికి చెందిన క్రీడాకారులు సాయిరాం, నరేంద్ర చారి, సంజయ్, రామయ్య, ప్రేమ్‌సాగర్, అర్జున్‌లు ఎంపికై నట్లు కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు ఆదివారం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను కోచ్, గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా కోచ్ మాట్లాడుతూ ఈ నెల 17నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతారని తెలిపారు. క్రీడాకారులను గ్రామ పెద్దలు డాక్టర్ వరప్రసాద్, చిటమట రఘు, ఎల్లయ్య, మల్లయ్య, ప్రభాకర్, శ్రీనివాస్‌లు అభినందించారు.
ఎన్‌ఎంఎంఎస్‌లో
విద్యార్థుల ప్రతిభ
ములుగు రూరల్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షలో బండారుపల్లి మోడల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాల ప్రిన్సిపాల్ దేవకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పెద్దపల్లి హర్షిత, అజ్మీరా సాయిరాం, పత్తి తన్మయిలు నవంబర్ –2024లో నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారని వివరించారు. ఎంపికై న విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నెలకు రూ.1000 చొప్పున స్కాలర్ షిప్ అందుతుందని పేర్కొన్నారు. ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ పోస్టర్ ఆవిష్కరణ
ములుగు: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన, గ్రీన్ ఇండియా చాలెంజ్ పోస్టర్‌ను ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ములుగు ఇన్‌చార్జ్ ప్రవీణ్, మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్‌రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గరిగె రఘు, వేములపల్లి రఘుపతి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గొర్రె సమ్మయ్య, ఎండీ యూనిస్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ బొమ్మినేని సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి
భూపాలపల్లి అర్బన్: పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని నియంత్రిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని హెచ్‌పీసీఎల్ సెల్స్ అధికారి వెంకటేశ్వర్లు కోరారు. హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అధికంగా వినియోగిస్తున్నారని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు. ఎలక్ట్రికల్, సోలార్ వైపు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్లు గండ్ర హరీశ్‌రెడ్డి, శ్యామ్, అశోక్‌రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.
తప్పిపోయిన చిన్నారి అప్పగింత
తప్పిపోయిన చిన్నారి అప్పగింత
Comments
Please login to add a commentAdd a comment