వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుంది. రాత్రి చలిగా ఉంటుంది.
రెండు పంటలు
పండిస్తున్నా..
నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. 200 అడుగుల నుంచి బోరు బావులకు నీరు పడుతుండడంతో నేను కూడా బోరు వేయించాను. రెండు పంటలకు పుష్కలంగా నీరు అందుతోంది. పంటల సాగుకు ఎలాంటి డోకా లేదు. ప్రభుత్వం స్పందించి రైతుల కష్టాన్ని పరిగణనలోకి తీసుకుని పంటలకు మద్దతు ధర చెల్లించాలి.
– భూక్యా లచ్ము, భాగ్యతండా
రైతులకు సూచనలు
చేస్తున్నాం..
ప్రతీ ఏడాది భూపాల్‌నగర్, రామచంద్రాపురం క్లస్టర్ ఏరియాల్లో రెండు పంటలు పండుతున్నాయి. భూగర్బ జలాలు సమృద్ధిగా ఉండడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. దీంతోపాటు నిమ్మనగర్ వద్ద దేవాదుల నీటి సరఫరా పాయింట్ ద్వారా సమీప చెరువులకు నీళ్లు అందుతున్నాయి. ఈ ప్రాంతంలో వరితోపాటు, మొక్కజొన్న ప్రధాన పంటగా సాగు అవుతోంది.
– కావ్య, ఏఈఓ, భూపాల్‌నగర్ క్లస్టర్
Comments
Please login to add a commentAdd a comment