రోగులకు అందుబాటులో ఉండాలి
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: రోగులకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు సూచించారు. మండల పరిధిలోని రొయ్యూరు(చెల్పాక) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలోని రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ పీహెచ్‌సీకి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించి మందులు ఇవ్వాలన్నారు. రోగులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపాలని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని మందుల నిల్వ గది, ల్యాబ్ టెక్నీషియన్ గది, రిజిస్టర్‌లను పరిశీలించారు. అదే విధంగా కన్నాయిగూడెం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్‌సీలో మందులు వివరాలపై ఆరా తీశారు. ల్యాబ్ టెక్నీషన్ గదితో పాటు రికార్డులను, హాజరు పట్టికను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి చంద్రకాంత్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment