జారి పడగలరు.. జాగ్రత్త..!
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ప్రతిరోజూ పర్యాటకులు, విద్యార్థులు సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చిన వారు మిడిల్ ప్లాట్‌ఫాం చివరన కూర్చొని ఫొటోలు దిగుతుంటారు. ఈ ప్లాట్‌ఫాం చుట్టూ రెయిలింగ్ లేకపోవడంతో ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలను తిలకించే క్రమంలో, గ్రూపు ఫొటోలు దిగే సమయంలో పర్యాటకులు కిందపడి గాయాలపాలవుతున్నారు. ప్రమాదమని తెలిసిన పర్యాటకులు, పాఠశాలల యాజమాన్యాలు గ్రూప్ ఫొటోల కోసం ప్రాధాన్యత ఇస్తుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్లాట్‌ఫాం చుట్టూ రెయిలింగ్ ఏర్పాటు చేసి పర్యాటకులు ప్రమాదాల భారిన పడకుండా పురావస్తుశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment