ప్రమాదం అంచున ప్రయాణం
● గూడ్స్ వాహనాల్లో పరిమితికి మించి కూలీల తరలింపు
ఏటూరునాగారం: మండల పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు మిర్చి కోత కోసేందుకు అటవీ గ్రామాల నుంచి గొత్తికోయగూడేలకు చెందిన కూలీలను గూడ్స్ వాహనాల్లో పరిమితికి మించి తరలిస్తున్నారు. దీంతో ఒకరిపై ఒకరు కూర్చొని వాహనాల్లో వెళ్తున్నారు. వాహనదారులు గూడ్స్ వాహనాల్లో జనాలను తరలించొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ విరుద్ధంగా తరలించడం గమనార్హం. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలపై ఆశలు కూడా ఉండవని ఈ దృశ్యాన్ని చూస్తే అర్ధం అవుతుంది. పోలీసులు, ఆర్టీఏ అధికారులు వాహనదారులు, కూలీలకు, రైతులకు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment