ఎయిడ్స్‌పై అవగాహన తప్పనిసరి
● ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్
ములుగు: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ములుగు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్ సూచించారు. ఈ మేరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మహర్షి విద్యాసంస్థల ఆవరణలో కరస్పాండెంట్ తుమ్మ పిచ్చిరెడ్డి అధ్యక్షతన శనివారం ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ ఈసం నారాయణతో కలిసి డాక్టర్ జగదీశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్ మాట్లాడుతూ అప్రమత్తంగా ఉంటేనే ఎయిడ్స్‌ను నియంత్రించగలమన్నారు. ఈసం నారాయణ మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తుందన్నారు. ఎయిడ్స్‌కు మందులేదని నివారణ ఒక్కటే మార్గం అని సూచించారు. ప్రాజెక్టు అధికారి జ్యోతి మాట్లాడుతూ జిల్లాలో 700మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని అందులో కేవలం 25శాతం మంది మాత్రమే మందులు వాడుతున్నారని తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కన్వీనర్ ప్రసన్ కుమార్ మాట్లాడుతూ నేటి యువత డ్రగ్స్‌కు బానిసలు అవుతుండడం బాధాకరం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment