
4వేల మంది క్రమబద్ధీకరణకు అనాసక్తి
2020లో దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారుగా 4వేల మంది ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మార్చి 31వ తేదీ వరకు చెల్లించే వారికి 25శాతం రాయితీని ప్రభుత్వం కల్పించినా ప్రజలు ముందుకురాలేదు. ఇదిలా ఉండగా గతంలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు మిగతా వారికి అమ్ముకోవడం, కొంత మంది ఇప్పటికే గ్రామ పంచాయతీల వారీగా అనుమతులు తీసుకొని ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లుగా అధికారుల సర్వేలో తేలింది. ఇంకొంత మంది గడువు తేదీని పెంచడంతో పాటు ప్రభుత్వం మరికొంత రాయితీ శాతాన్ని పెంచి మరో అవకాశం కల్పిస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది.