
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
ములుగు: ఈ నెల 20నుంచి నిర్వహించనున్న ఇంటర్, టెన్త్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇంటర్, 10వ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్న పత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఇతరులు ఎవరూ ఉండ వద్దన్నారు. గుర్తింపు పొందిన వారిని మాత్రమే అనుమతించాలని సూచించారు. ఇంటర్ పరీక్షలకు జిల్లాలో మూడు సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 712 మంది పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా పదో తరగతి పరీక్షలకు మూడు సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 521 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు వివరించారు. వేసవి దృష్ట్యా వైద్య శిబిరాలతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. అవసరమైన చోట మహిళా పోలీసులను డ్యూటీలో కేటాయించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ పాణిని, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణ అధికారి జయదేవ్, పంచాయతీరాజ్, విద్యుత్, రెవెన్యూ, పోలీస్, పోస్టల్, ఆర్టీసీ, విద్యా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్‌జీ