
ఇద్దరు గురుకుల విద్యార్థులకు అస్వస్థత
తెలకపల్లి: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న చందన, వైష్ణవి బుధవారం రాత్రి అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ సురేశ్ గురువారం పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు డా. సురేశ్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రిన్సిపల్ రష్మి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో చేరిన విద్యార్థులకు ఆస్తమా ఉందని, శాస్వ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని వివరించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. చల్లటి నీటితో స్నానాలు చేయడంతో అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ జాకీర్ అలీ, ప్రత్యేక అధికారి నర్మద ఉన్నారు.
అసంక్రమిత వ్యాధుల
స్క్రీనింగ్ పూర్తి చేయాలి
బల్మూర్: అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా ప్రోగాం అధికారి డా. కృష్ణమోహన్ ఆదేశించారు. గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వృద్ధుల కోసం ప్రతి గురువారం ప్రత్యేక శిబిరం నిర్వహించి అయోడిన్ లోపంతో వచ్చే రుగ్మతల గురించి వివరించి సూచనలు, మాత్రలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డా. కల్పన, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్లు విజయ్‌కుమార్, మల్లేశ్, ఫార్మసిస్ట్ శ్రీనివాసులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
సగర శంఖారావాన్ని
విజయవంతం చేయాలి
నాగర్‌కర్నూల్ రూరల్: సగరుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 16న జిల్లాకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సగర శంఖారావం నిర్వహిస్తున్నామని.. సగరులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికృష్ణ పిలుపునిచ్చారు. గురువారం పుర పరిధిలోని ఊయ్యాలవాడ సమీపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరాముడి వారసత్వం, భగీరథుడి వంశం సగరులదని.. ఇప్పుడు సగర కులం అంటే రోజువారీ కూలీలు, తాపీ మేసీ్త్రలుగా మిగిలిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని, బీసీలకు ప్రభుత్వం కల్పిస్తామన్న 42 శాతం రిజర్వేషన్లలో సగరుల వాట ఎంత అని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఏర్పాటుచేసి చైర్మన్ పదవి సగరులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు శేఖర్, జిల్లా ఇన్‌చార్జ్ మోడం ఆంజనేయులు, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ప్రణీల్, కార్యదర్శి వేముల సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు గురుకుల విద్యార్థులకు అస్వస్థత
Comments
Please login to add a commentAdd a comment