మరోసారి కులగణన సర్వే
అచ్చంపేట: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను మరోసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది నవంబర్‌లో తొలి విడత సర్వే చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో చాలామంది ఈ సర్వేలో పాల్గొనలేదు. ఇప్పుడు అందరి కోసం కా కుండా గతంలో సర్వేలో పాల్గొనని కుటుంబాలను మా త్రమే పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు ఆదివా రం నుంచి ఈ నెల 28 వరకు సర్వే కొన సాగుతోంది. గతేడా ది నబంవర్ 6 నుంచి 8 వరకు ఎన్యుమరేటర్లు హౌస్ లి స్టింగ్ చేసి ఇళ్ల లెక్క తేల్చారు. తర్వాత ఇంటింటికి వెళ్లి కు టుంబ సభ్యుల వివరాలు నమోదు చేపట్టారు. జిల్లాలో 2,20,233 కుటుంబాలను గుర్తించి సర్వే చేయగా.. కు టుంబాల సంఖ్య 2,50,596గా తేలింది. ఇందులో 2,49,180 కుటుంబాల సర్వే పూర్తి కాగా.. మిగిలిన కుటుంబాలను ఇప్పుడు చేయాల్సి ఉంది. అయితే బీసీల శాతం ఈ జాబితాలో తక్కువ వచ్చిందని విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడంతో మిగిలిన కుటుంబాలను సర్వే చేసేందుకు ముందుకు వచ్చింది. సర్వేకు దూరంగా ఉన్న వాజుజీ ఇప్పుడు పాల్గొ ని వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment