శనేశ్వరుడికి పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడికి భక్తుల చేత ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తిలతైలాభిషేక పూజలు చేయించారు. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి.. భక్తిశ్రద్ధలతో శనేశ్వరుడికి పూజలు చేశార. అనంతరం బ్రహ్మసూత్ర పరమ శివుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.
వేరుశనగ పరిశ్రమ
పరిశీలన
వనపర్తి రూరల్: మండలంలోని దత్తాయిపల్లి శివారులో గత ప్రభుత్వం మండల మహిళా సమాఖ్య (ఐకేపీ) ఽఆధ్వర్యంలో వేరుశనగ నూనె పరిశ్రమను ఏర్పాటుచేసింది. నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ జిల్లా డీఏఓ చంద్రశేఖర్, ఏడీ పూర్ణచంద్రారెడ్డి, ఏఓ నరేశ్, ఏఈఓ రత్నరావు శనివారం గ్రామానికి చేరుకొని పరిశ్రమను పరిశీలించారు. వనపర్తి డీపీఎం అరుణ మిషనరీ, పరిశ్రమ నిర్మాణ వ్యయాన్ని వారికి వివరించారు. డీఏఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకుగాను కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం వెంకటన్న, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.6,841
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం 3,149 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,841, కనిష్టంగా రూ.4,009 ధరలు లభించాయి. అదేవిధంగా కందులకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,000, కనిష్టంగా రూ.5,667, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,388, కనిష్టంగా రూ.2,270, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,100, కనిష్టంగా రూ.5,555, పత్తి గరిష్టంగా రూ.6,109, కనిష్టంగా రూ.5,889 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆముదాలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5,716, కనిష్టంగా రూ.5,709, కందులు గరిష్టంగా రూ.6,909, కనిష్టంగా రూ.6,709గా ధరలు నమోదు అయ్యాయి.
శనేశ్వరుడికి పూజలు
Comments
Please login to add a commentAdd a comment