ప్రాదేశిక పోరుకు సన్నద్ధం
అచ్చంపేట: జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల జాబితా కొలిక్కి వచ్చింది. అభ్యంతరాల స్వీకరణ, మార్పుచేర్పుల అనంతరం తుది జాబితాను అధికారులు ప్రకటించారు. మండలాల వారీగా మహిళలు, పురుఘలు, ఇతరుల ఓటర్ల వివరాలను జిల్లా, మండల ప్రజాపరిషత్ కార్యాలయాలతో పాటు గ్రామపంచాయతీలలో ప్రదర్శించారు. కోడ్ కంటే ముందుగానే ఎన్నికలకు సిద్ధం కావాలని, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ర్యాంపులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను పరిశీలిస్తున్నారు.
మూడు నెలల సమయం?
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నా.. అధికారులు ఎన్నికల పనుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాలను గుర్తించి జాబితాలను జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 20 జెడ్పీటీసీలు, 214 ఎంపీటీసీ స్థానాలకుగాను 1,187 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 6,54,819 ఓటర్లుండగా.. పురుషులు 3,27,930 మంది, మహిళలు 3,26,870 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. ఎన్నికలు వాయిదా పడతాయనే భావనలో ఉండొద్దని.. ఏర్పాట్లలో నిమగ్నం కావాలని అధికారులకు పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పోలింగ్ కేంద్రాలు ఖరారు కావడంతో టీ–పోల్ యాప్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా 500 నుంచి 700 మంది ఓటర్లను మ్యాపింగ్ చేసి కేంద్రాలకు కేటాయించాల్సి ఉంది. గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏది ముందు నిర్వహించాల్సి వచ్చినా.. అందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.
పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల.. స్థానాలు ఖరారు
ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నఅధికారులు
ప్రాదేశిక పోరుకు సన్నద్ధం
Comments
Please login to add a commentAdd a comment