నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి
కందనూలు: విద్యార్థుల్లో నైపుణ్యాలు, కమ్యూనికేషన్, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఆర్పన్ రెసిడెన్షియల్ పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం నిర్వహించగా ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు లేని పిల్లలే పాఠశాలలో చదువుతుంటారని.. సిబ్బంది వారి అవసరాలను గుర్తించి ఎల్లవేళలా పని చేయాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు అలవడాలని.. దీంతో సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దగలుగుతామని తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి షర్ఫొద్దీన్, మండల విద్యాధికారి భాస్కర్‌రెడ్డి, ప్రిన్సిపల్ వి.రాధ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment