జెన్‌కో అతిథిగృహం వద్ద మంటలు
దోమలపెంట: ఈగలపెంట నుంచి శ్రీశైలం ఆనకట్టకు వెళ్లే రహదారిలో ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. జెన్‌కో అతిథిగృహం, కృష్ణవేణి భవనం చుట్టూ మంటలు వ్యాపించడాన్ని గుర్తించిన ఓఅండ్‌ఎం స్టోర్స్ సిబ్బంది.. పోలీసులతో పాటు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం ఫైర్‌స్టేషన్ ఆఫీసర్ మల్లికార్జున్‌కు సమాచారం అందించారు. ఫైరింజన్‌తో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం దాదాపు 4 గంటలపాటు శ్రమించారు. మరోవైపు ఎస్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ శ్రావణ్, కానిస్టేబుల్ దర్శన్ తదితరులు శ్రీశైలం రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ అగ్నిప్రమాదం బారిన పడకుండా చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు బీడీ లేదా సిగరేట్ కాల్చి వేయడంతో మంటలు వ్యాపించాయని భావిస్తున్నట్లు ఎస్‌ఐ అనూప్ తెలిపారు.
ఈగలపెంట సమీపంలో వ్యాపించిన మంటలు
Comments
Please login to add a commentAdd a comment