‘అపార్’ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టండి
నాగర్‌కర్నూల్: విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అపార్ నమోదు ప్రక్రియపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అదనపు కలెక్టర్ పి.అమరేందర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం అపార్ నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అపార్ జనరేట్ ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఎంఈఓలు, ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అపార్ నమోదుకు సంబంధించి బర్త్ సర్టిఫికెట్ మంజూరుకు సంబంధించి నెలకొన్న సందేహాలపై డిజిటల్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఈఓ రమేష్ కుమార్, డీఐఈఓ వెంకటరమణ, డీటీడబ్ల్యూఓ ఫిరంగి, సెక్టోరియల్ అధికారులు నూరుద్దీన్, షర్ఫుద్దీన్, వెంకటయ్య, మురళీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment