పాల సేకరణ పెంచాలి
అచ్చంపేట: గ్రామీణ ప్రాంతాల రైతుల నుంచి నాణ్యమైన పాలు సేకరించి విజయ డైరీ అభివృద్ధికి కృషి చేయాలని డైరీ డెవలప్‌మెంట్ అధికారి కవిత అన్నారు. గురువారం అచ్చంపేట పాలశీతలీకరణ కేంద్రంలో పాల సేకరణ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాల సేకరణ తగ్గకుండా రైతులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ.. వారు ప్రైవేట్ సంస్థల వైపు మళ్లకుండా పాల సేకరణ చేయాలన్నారు. పాడి పశువులు ఆరోగ్యంగా ఉంటేనే అధిక పాలు ఇస్తాయని, ఇందుకోసం విజయ డైరీ ద్వారా సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు, దాణా, మినరల్ మిక్చర్, క్యాల్షియం సరఫరా చేసేందుకు కృషి చేస్తామన్నారు. అచ్చంపేటలో 63 సెంటర్ల ద్వారా ఇంతకు ముందు ప్రతిరోజు 10 వేల లీటర్ల పాల సేకరణ జరిగేదని, ప్రస్తుతం 7 వేల లీటర్ల పాలు మాత్రమే వస్తున్నాయని చెప్పారు. పాలలో ఫ్యాట్ 6, 7 శాతం వచ్చే లా నాణ్యమైన పాలు సేకరించాలని సూచించారు. అయితే ఫ్యాట్‌ను నిర్ధారించే పరికరాలు, పాలు కొలిచే యంత్రం, రైతుల జాబితా నమోదు చేసుకునే రిజిష్టర్లు ఇవ్వాలని, గేదె పాల ధరలు పెంచాలని, పాల సేకరణ ఏజెంట్లు సంబంధిత అధికారిని కోరారు. ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే అందజేసేందుకు కృషిచేస్తానన్నారు. సమావేశంలో విజయ డైరీ చైర్మన్ నర్సయ్యయాదవ్, మేనేజర్ రాములు తదితరులు పాల్గొన్నారు.
మైనింగ్ ఆపాలని
పోస్టుకార్డు ఉద్యమం
బల్మూర్: మండలంలోని మైలారం గుట్టపై మైనింగ్ తవ్వకాలు నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డు ఉద్యమం చేపట్టినట్లు మైనింగ్ వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు గుండాల వెంకటెశ్వర్లు అన్నారు. గురువారం మండల కేంద్రంలో మైలారం గ్రామ మైనింగ్ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు పంపి నిరసన తెలిపారు. వెంటనే గుట్టపై జరుగుతున్న మైనింగ్ తవ్వకాల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మైనింగ్ వ్యతిరేక కమిటీ సభ్యులు దేవస్వామి, రమేష్‌గౌడ్, లింగయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మేధో సంపత్తి
హక్కులతో ప్రయోజనం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మేధో సంపత్తి హక్కులతో పరిశోధనలు చేసే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో మేధో సంపత్తి హక్కులపై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పూర్తి స్థాయి హక్కులు పొందిన తర్వాతనే వాటిని ప్రకటించాలని, అప్పుడు ప్రచురణలు, ప్రయోగాల కు పూర్తిస్థాయిలో విలువ ఉంటుందన్నారు. ఆవిష్కరణలకు పరిరక్షణ, హక్కులు కలిగి ఉండాలంటే తప్పకుండా మేధో సంపత్తి హ క్కులుండాలని, రీసెర్చ్ విద్యార్థులు అధ్యాపకులు వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలి గి ఉండాలని సూచించారు. ఇప్పుడు చేసిన ప్రయోగాలు భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, వక్త శంకర్‌రావు, ఐక్యూఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కంట్రోలర్ రాజ్‌కుమార్, మధు, అర్జున్‌కుమార్, కుమారస్వామి, శాంతిప్రియ, విజయలక్ష్మీ పాల్గొన్నారు.
పాల సేకరణ పెంచాలి
Comments
Please login to add a commentAdd a comment