ఎకై ్సజ్ అధికారుల విస్తృత తనిఖీలు
కొల్లాపూర్: మండలంలో రెండు రోజులుగా ఎకై ్సజ్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గురువారం అమరగిరి, మారెడుమాన్‌దిన్నె, యాపట్ల, చంద్రబండతండా, జొన్నలబొగుడ తదితర గ్రామాల్లో తనిఖీలు చేపట్టి.. 150 కిలోల నల్లబెల్లం, 20 కిలోల పటికను స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఏఎస్పీ భాస్కర్ మాట్లాడారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 10 టీంలతో కలిసి రెండు రోజుల పాటు విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు. గంజాయి విక్రయాలపైనే దృష్టిసారించామన్నారు. జిల్లావ్యాప్తంగా నెలరోజులుగా స్పెషల్ డ్రైవ్ కొనసాగించామన్నారు. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో 21 కేసులు నమోదు చేసి, 26 మందిని అరెస్టు చేశామన్నారు. 4,500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామని, 118 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. 24 వాహనాలు, 9 సెల్‌ఫోన్లను సీజ్ చేశామన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన తనిఖీల్లో డీఎస్పీ తిరుపతియాదవ్, ఎస్టీఎఫ్ టీం లీడర్స్ అంజిరెడ్డి, ప్రదీప్‌రావు, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గాయత్రి, ఎకై ్సజ్, పోలీస్ శాఖకు చెందిన సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment