చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వచ్చే నెలలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు, తలానీలాలు, కొబ్బరి చిప్పలకు వేలంలో పాటదారులు డిపాజిట్ చేసి పాల్గొన్నారు. కొబ్బరి కాయల వేలానికి సరైన వేలం రాకపోవడంతో వాయిదా వేసినట్లు చైర్మన్, ఈఓ తెలిపారు. కొబ్బరి చిప్పలకు నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన సాంబశివుడు రూ.2,01 లక్షలు, తలనీలాలు నాగర్‌కర్నూల్‌కు చెందిన మల్లికార్జున్ రూ.1.19 లక్షలకు పాటలో దక్కించుకున్నారు. వాయిదా పడిన కొబ్బరికాయల వేలం గురువారం నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వీణాధరి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.