చోరీ జరిగింది ఈ కారులో నుంచే..
మిర్యాలగూడ: గుర్తుతెలియని వ్యక్తులు కారు అద్దాలు పగులగొట్టి రూ.4.74లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన బుధవారం దామరచర్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. దామరచర్ల మండల కేంద్రానికి చెందిన అజ్మీరా మాలు, వెంకట్‌రెడ్డి, అంజి, రామారావు, లక్ష్మణ్, రమేష్, రాజేంద్రబాబు కలిసి గతంలో కొనుగోలు చేసిన ఇంటి స్థలాన్ని వేరొక వ్యక్తికి విక్రయించారు.
స్థలాన్ని బుధవారం మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొనుగోలుదారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయగా.. అతడు వీరికి ఇవ్వాల్సిన రూ.4.74లక్షల నగదును ఇచ్చాడు. ఆ నగదు తీసుకొని వీరు తిరిగి దామరచర్లకు బయల్దేరారు. దామరచర్ల మండల కేంద్రంలోని హోటల్ గ్రాండ్‌శ్రీ ఎదుట కారును నిలిపి డబ్బును అందులోనే పెట్టి భోజనం చేయడానికి హోటల్ లోపలికి వెళ్లారు.
ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కారు అద్దాలు పగులగొట్టి అందులోని రూ.4.74లక్షల నగదు తీసుకొని పారిపోయారు. భోజనం చేసి వచ్చిన తర్వాత కారు అద్దం పగులగొట్టి ఉండటం, అందులోని డబ్బు లేకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దొంగలు చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. కారును ముందు నుంచే అనుసరిస్తున్న ఇద్దరు దొంగలు బైక్‌పై హెల్మెట్ పెట్టుకొని వచ్చి కారు అద్దాలు పగులకొట్టి డబ్బులు చోరీకి పాల్పడినట్లు బాధితులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment