స్వర్ణశోభితం | - | Sakshi
Sakshi News home page

స్వర్ణశోభితం

Published Mon, Feb 24 2025 1:44 AM | Last Updated on Mon, Feb 24 2025 1:43 AM

స్వర్

స్వర్ణశోభితం

దివ్య మందిరం..
బంగారు తాపడంతో రూపుదిద్దుకున్న యాదగిరి క్షేత్ర విమాన గోపురం

సీఎం పర్యటన

సాగిందిలా..

● ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు యాదగిరి క్షేత్ర సన్నిధిలో ఒక గంట 53 నిమిషాలు గడిపారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన సీఎం దంపతులు ఉదయం 11.15 గంటలకు యాదగిరి కొండపై గల అతిథి గృహానికి చేరుకున్నారు.

● అతిథిగృహంలో సంప్రదాయ దుస్తులు ధరించి 11.20కి లిఫ్టు మార్గంలో ఉత్తర మాఢవీధిలోకి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పంచకుండాత్మక యాగశాలోకి వెళ్లి కుంభాభిషేకానికి ఉపయోగించే జలాలకు పూజలు చేశారు.

● 11.28కి యాగశాల నుంచి ఉత్తర ద్వారం దక్షిణ తిరు వీధులోకి వచ్చారు.

● నిచ్చెన మెట్ల ద్వారా విమాన గోపురం వద్దకు 11.32 గంటలకు చేరుకున్నారు.

● 11.32కు స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించారు.

● 11.35కు విమానగోపురంపై ఉన్న శ్రీసుదర్శన చక్రం వద్దకు వెళ్లి వానమామలై రామానుజ జీయర్‌ స్వామీజీ పర్యవేక్షణలో పూజలు చేశారు. –11.45కు సుదర్శన చక్రానికి, స్వర్ణ విమాన గోపురానికి మహా కుంభాభిషేక, సంప్రోక్షణ పూజలు నిర్వహించారు.

● 11.52కు సుదర్శన చక్రం చుట్టూ సీఎం దంపతులు, ప్రముఖులు, అర్చకులు ప్రదక్షిణలు చేశారు.

● 11.56కు సుదర్శన చక్రం నుంచి విమానగోపురం వద్దకు చేరుకుని తూర్పు త్రితల ద్వారం మార్గంలో ప్రధానాలయంలోకి వెళ్లారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.

● 12.10కి గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకున్నారు.

● 12.20కి ముఖ మండపంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులతో పాటు సీఎస్‌ శాంతికుమారి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులకు ప్రధానాచార్యులు వేద ఆశీర్వచనం చేశారు.

● 12.25కు ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి శ్రీస్వామి వారి మహాప్రసాదాన్ని, దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, ఈఓ భాస్కర్‌రావు సీఎం దంపతులకు విమాన గోపుర ప్రతిమ అందజేశారు.

● 12.28కు సీఎం దంపతులు.. వానమామలై రామానుజ జీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం హుండీల్లో కానుకలు సమర్పించారు.

● 12.33కు పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు.

● 12.35కు లిఫ్టు మార్గంలో అతిథి గృహానికి చేరుకున్నారు.

● 12.40 నుంచి 1.05 గంటల వరకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

● 1.08కి యాదగిరి కొండపై నుంచి ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు వెళ్లి తన చిన్ననాటి స్నేహితుడి కుమార్తె వివాహంలో పాల్గొన్నారు. అక్కడే భోజనం చేసి హైదరాబాద్‌కు రోడ్డుమార్గంలో బయలుదేరి వెళ్లారు.

యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అద్భుతఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు, దాతలు సమర్పించిన బంగారంతో రూపుదిద్దుకున్న ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్‌ స్వామితో కలిసి శ్రీలక్ష్మీనారసింహుడికి అంకితం ఇచ్చారు. స్వర్ణతాపడంతో దివ్య విమానగోపురం భక్తులను కనువిందు చేస్తోంది. ఇప్పటికే గర్భాలయ ద్వారాలు, ధ్వజస్తంభం, రాజగోపురాల విమానాలు, అష్టభుజి ప్రాకారాలపై ఉన్న విమానాల కలశాలకు బంగారు తాపడం చేసి బిగించారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో శ్రీస్వామి వారి క్షేత్రం అద్భుతంగా కనిపించేలా బంగారు వర్ణంలో ఉండే విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆలయమంతా స్వర్ణమయంతో కాంతులీనుతుంది.

ఐదు రోజుల పాటు కొనసాగిన యాగం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మహోత్సవంలో భాగంగా ఈ నెల 19వ తేదీన పంచకుండాత్మక యాగానికి శ్రీకారం చుట్టారు. ఐదు రోజుల పాటు సాగిన ఈ యాగంలో చివరి రోజు ఆదివారం మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఆలయ ఆస్థాన మండపంలో శ్రీస్వామి, అమ్మవార్లకు శాంతికల్యాణం పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించి పంచకుండాత్మక యాగాన్ని ముగించారు. అంతకుముందు స్వర్ణ విమాన గోపురం వద్ద శాస్త్రోక్తంగా వానమామలై రామానుజ జీయర్‌ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అర్చకులు మహా కుంభాభిషేకం, సంప్రోక్షణ వేడుక జరిపించి శ్రీస్వామివారికి అంకితం ఇచ్చారు. శ్రీస్వామి వారి పంచకుండాత్మక యాగంలో, మహా కుంభాభిషేక సంప్రోక్షణ వేడుకలో కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యాలయ ఓఎస్‌డీ శ్రీనివాస్‌, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌, ప్రధానార్చకులు నల్లంథీఘల్‌ లక్ష్మీనర్సింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, కిరణ్‌కుమారాచార్యులు, దేవస్థానం ఈఓ ఏ.భాస్కర్‌రావు, దేవస్థాన అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య. భువనగిరి, నకిరేకల్‌, తుంగతుర్తి, దేవరకొండ ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేలు, బాలునాయక్‌, జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, డీసీపీ రాజేశ్‌చంద్ర, ఏఎస్పీ రాహుల్‌రెడ్డి, మహిళా అభివృద్ధి కార్పొరేషన్‌ బండ్రు శోభారాణి, వైటీడీఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కిషన్‌రావు, విజయ డైయిరీ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, కె.గంగాధర్‌, గోల్డ్‌ ప్లేటింగ్‌ కమిటీ సభ్యులు గోవింద హరి, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఫ దేశంలోని ఆలయాల్లోనే ప్రప్రథమం

ఫ ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఫ వానమామలై రామానుజ జీయర్‌ స్వామితో కలిసి

శ్రీలక్ష్మీనృసింహుడికి అంకితం

ఫ వైభవంగా సాగిన మహాకుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవం

దేశంలోనే ఎత్తయిన విమాన గోపురం

యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం దేశంలోని ఆలయాల్లో కెల్లా ఎత్తయినదని, అంత ఎత్తులో ఉన్న విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి చేయడం ఇదే ప్రథమమని ఆలయ అధికారులు, అర్చకులు చెబుతున్నారు.

విమాన గోపురం 50.5 అడుగుల ఎత్తు, 10,759 చదరపు అడుగుల వైశాల్యం

భక్తులు, దాతలు విరాళంగా సమర్పించిన బంగారం 68 కిలోలు

చైన్నెకి చెందిన ఎంఎస్‌ స్మార్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ 2024 డిసెంబర్‌ 1న స్వర్ణతాపడం పనులు ప్రారంభించింది.

తమిళనాడుకు చెందిన స్తపతి రవీంద్రన్‌ 50 మంది కార్మికులతో కలిసి విమానగోపురానికి తాపడం కవచాల బిగింపు పనులను ఈనెల 18న పూర్తి చేశారు.

బంగారు తాపడం బిగింపునకు రూ.5.10 కోట్లు (జీఎస్టీ కాకుండా) ఖర్చు చేశారు. ఇందులో రాగి రేకుల తయారీకి రూ.12లక్షలు వెచ్చించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
స్వర్ణశోభితం1
1/3

స్వర్ణశోభితం

స్వర్ణశోభితం2
2/3

స్వర్ణశోభితం

స్వర్ణశోభితం3
3/3

స్వర్ణశోభితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement