ప్రశాంతంగా టీజీ సెట్–2025
నల్లగొండ : టీజీ సెట్–2025 ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లా కేంద్రంలోని చర్లపల్లి బైపాస్ వద్ద ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో నిర్వహించిన టీజీసెట్ ప్రవేశపరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేసి మాట్లాడారు. 2025 –26 విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశం, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీల ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షకు మొత్తం 12,929 మంది విద్యార్థులకుగాను 12,503 మంది హాజరయ్యారని.. 426 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. కలెక్టర్ వెంట గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
సోమేశ్వరాలయంలో సినీ డైరెక్టర్ శంకర్ పూజలు
వేములపల్లి(మాడ్గులపల్లి) : మండలంలోని చిరుమర్తి గ్రామంలో గల శ్రీవరాల సోమేశ్వరాలయంలో శివాలయ గౌరవ అధ్యక్షుడు, సినీ డైరెక్టర్ నిమ్మల శంకర్, మాధవి దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ సింహద్వారాన్ని ప్రతిష్టించారు. స్వామివారి కల్యాణోత్సవానికి సంబంధించిన సామగ్రిని ఆలయ కమిటీకి అందజేశారు. కార్యక్రమంలో పూజారి కూరెళ్ల వెంకటాచారి, గొట్టిపర్తి బచ్చయ్య, తాళ్లపల్లి మిన్నయ్య, నమోజు ఉపేంద్రచారి, శంకరాచారి, నాగాచారి, నక్క ఉపేందర్, కొండా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
‘ఐఎంఏ జూనియర్ డాక్టర్ల వైఖరి సరికాదు’
నల్లగొండ టౌన్ : గ్రామీణ స్థాయిలో ప్రజలకు క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందించి ప్రాణాపాయం నుంచి కాపాడుతున్న గ్రామీణ వైద్యుల పట్ల ఐఎంఏ జూనియర్ డాక్టర్లు చులకన భావంతో మాట్లాడడం సరికాదని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పి.హనుమంతరావు అన్నారు. ఆదివారం నల్లగొండలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ కోదండరాం దిష్టిబొమ్మను ఐఎంఏ జూనియర్ డాక్టర్లు దగ్ధం చేయటం హేయమైన చర్య అన్నారు. గ్రామీణ వైద్యులు సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. గతంలో ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు శిక్షణనిచ్చి క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్యం అందించాలని ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో బి.శ్రీనివాసరాజు, జి.నర్సింహారెడ్డి, సీహెచ్.బ్రహ్మచారి, డీఎస్‌ఎన్.చారి, నజీరుద్దీన్, పి.వెంకటేశ్వర్లుగౌడ్, ఎం.మధనాచారి, యాదగిరి, లలిత, మణికుమారి, దశరథ, దేవయ్య పాల్గొన్నారు.
ప్రశాంతంగా టీజీ సెట్–2025
ప్రశాంతంగా టీజీ సెట్–2025
Comments
Please login to add a commentAdd a comment