యాసంగి సాగు 5,37,539 ఎకరాలు
నల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సీజన్ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,37,539 ఎకరాల్లో వరి, సజ్జ, జొన్న, వేరుశనగ తదితర పంటలను రైతులు సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా నాగార్జునసాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి విడుదల అవుతుండడంతో పాటు భూగర్భజలాలు వృద్ధి చెందడంతో రైతులు పెద్ద ఎత్తున వరిసాగు చేశారు. దేవరకొండ డివిజన్‌లోని చందంపేట, దేవరకొండ మండలాల్లో వేరుశనగను సాగు చేశారు. అయితే వరిసాగు మాత్రం జిల్లా వ్యవసాయశాఖ అంచనాలకు తగ్గింది. జిల్లా వ్యాప్తంగా 5,56,920 ఎకరాల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా.. 5,12,443 ఎకరాల్లోనే రైతులు నాట్లు వేశారు. ఇప్పటి వరకు వరితో పాటు సజ్జ 23 ఎకరాల్లో, జొన్న 485 ఎకరాల్లో, ఆముదం 87, వేరుశనగ 24,148 ఎకరాల్లో రైతులు సాగు చేశారు.
మండలాల వారీగా సాగు ఇలా..
జిల్లాలో వరి సాగు ప్రధానంగా మిర్యాలగూడ మండలంలో 41,672 ఎకరాల్లో, నల్లగొండ 35,501, నిడమనూరు 35,443, కనగల్ 35,096, మాడుగులపల్లి 34,010, త్రిపురారం 28,862, తిప్పర్తి 28,396, కట్టంగూరు 20,400, కేతేపల్లి 20,580, నార్కట్‌పల్లి 20,450, పీఏపల్లి 19,380, వేములపల్లి 18,556, చందంపేట 1246, నేరెడుగొమ్ము 2,830, దేవరకొండ 2,270, చింతపల్లి 3,190, నాంపల్లి 3,421, అడవిదేవులపల్లి 3,400, మర్రి గూడ 4,148, చండూరు మండలంలో 5,311 ఎకరాల్లో రైతులు వరిసాగును చేశారు. చందంపేట మండంలో మాత్రం వేరుశనగ పంటను 9,267 ఎకరాల్లో రైతులు సాగు చేయడం విశేషం.
ఫ 5,12,443 ఎకరాల్లో వరి
ఫ దేవరకొండ డివిజన్‌లో వేరుశనగ సాగు
ఫ ముగిసిన యాసంగి సీజన్
Comments
Please login to add a commentAdd a comment