నల్లగొండ, చందంపేట : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో జిల్లా యంత్రాంగం కూడా నిమగ్నమైంది. రెండు రోజులుగా అక్కడే ఉండి ఆయా బృందాలకు సహకారం అందిస్తోంది. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ సీఈ అజయ్‌కుమార్‌తో పాటు ఈఈ సత్యనారాయణ, టన్నెల్ డీఈ శ్రీనివాసులు అక్కడి అధికారులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని పలు 108 వాహనాలను టన్నెల్ వద్దకు తరలించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు.
ఔట్‌లెట్ పనులపై ప్రభావం..
ఎస్‌ఎల్‌బీసీ ఔట్‌లెట్ పనులు నెల రోజుల వ్యవధిలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. టీబీఎం మిషన్ బేరింగ్ ఇప్పటికే చైన్నె పోర్ట్‌కు చేరుకుంది. పదిహేను రోజుల్లో ఎస్‌ఎల్‌బీసీ ఔట్‌లెట్ వద్దకు బేరింగ్ చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇన్‌లెట్ వద్ద మట్టి పెళ్లలు ఊడిన పడిన ఘటనతో ఔట్‌లెట్ పనుల ప్రారంభంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment