ఆటో బోల్తా.. మహిళా కూలీ మృతి
త్రిపురారం: అదుపుతప్పి ఆటో బోల్తా పడి మహిళా కూలీ మృతిచెందగా.. మరికొంత మంది కూలీలకు గాయాలయ్యాయి. ఈ ఘటన నిడమనూరు మండలం వేంపాడు గ్రామ స్టేజీ వద్ద శనివారం జరిగింది. నిడమనూరు ఎస్‌ఐ గోపాల్‌రావు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కోమటిగూడెం గ్రామానికి చెందిన కూలీలు పత్తి, మిరపకాయలు ఏరడానికి ప్రతిరోజు ఆటోలో హాలియా, పెద్దవూర మండలాలకు వెళ్తున్నారు. శనివారం కూడా ఆటోలో 12మంది కూలీలు వెళ్తుండగా.. నిడమనూరు మండలం వేంపాడు గ్రామ స్టేజీ వద్ద లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్లల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు మేకల రాములమ్మ, అనుముల కృష్ణయ్య, అనుముల సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో మిర్యాలగూడలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మేకల రాములమ్మ(55) మృతిచెందింది. మిగతా కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో పరిమితికి మించి కూలీలు ప్రయాణిస్తుండడంతో పాటు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. క్షతగాత్రుడు అనుముల కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపారు.
ఫ ఇద్దరికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment