ఉత్కంఠగా కొనసాగుతున్న ఎద్దుల పందేలు
మేళ్లచెరువు: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మేళ్లచెరువు మండల కేంద్రంలోని శివాలయం వద్ద నిర్వహిస్తున్న ఎద్దుల పందేలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన సబ్ జూనియర్ విభాగంలో 14 జతల ఎద్దులు పాల్గొనగా ఏపీలోని ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం మద్దిరాల ముప్పాళ్ల గ్రామానికి చెందిన పుచ్చకాయల శేషాద్రిచౌదరికి చెందిన ఎద్దుల జత మొదటి బహుమతి సాధించాయి. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన ప్రతీక రామకృష్ణకు చెందిన ఎద్దుల జత రెండో బహుమతి, ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామానికి గరికపాటి శ్రీధర్‌రావుకు చెందిన జత మూడో బహుమతి సాధించాయి.
జూనియర్ విభాగంలో..
సాయంత్రం నిర్వహించిన జూనియర్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన రోహన్‌బాబు ఎద్దుల జత మొదటి స్థానం, ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ల శివకృష్ణయాదవ్ జత రెండో బహుమతి సాధించాయి. మొదటి బహుమతిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్, రెండో బహుమతిగా రూ.1,05,000, మూడో బహుమతిగా రూ.95వేలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment