ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
నల్లగొండ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిఘా నీడలో నిర్వహిస్తాం. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు వాటిని అనుసంధానం చేశాం. అక్కడి నుంచే ఉన్నతాధికారులు పరీక్షల నిర్వహణను పరిశీలిస్తారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచిస్తున్నారు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి దస్రూనాయక్. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
పరీక్షలు రాయనున్న
28,772 మంది విద్యార్థులు
మార్చి 5 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 28,772 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ఫస్టియర్ 13,992 మంది, సెకండియర్ 14,730 మంది ఉన్నారు. పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్షలకు సంబంధించి మెటీరియల్‌ను పంపిణీ చేయడంతో పాటు హాల్ టికెట్లను విద్యార్థులకు అందజేశాం. ఈసారి హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్ ముద్రించాం. దాన్ని స్కాన్ చేస్తే ఆ పరీక్ష కేంద్రం పూర్తి అడ్రస్ ఎక్కడ ఉందనేది తెలుస్తుంది.
ఎగ్జామినేషన్ కమిటీ నియామకం..
పరీక్షల నిర్వహణకు ఎగ్జామినేషన్ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీలో డీఐఈఓతోపాటు దేవరకొండ బాలికల జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.శ్రీదేవి, చింతపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ధనరాజ్, కేపీఎం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎండీ.ఇస్మాయిల్ ఉన్నారు. హైపవర్ కమిటీకి కలెక్టర్, ఎస్పీ, నకిరేకల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ మల్లారెడ్డి, కేపీఎం కాలేజీ జూనియర్ లెక్చరర్ బి.బాలోజి ఉన్నారు. ప్లయింగ్ స్క్యాడ్ బృందంలో పిజిక్స్ లెక్చరర్ ఎం.ధనమ్మ, ఎం.షీబాలు ఉన్నారు.
పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి
విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి. పరీక్ష సమయాని గంట ముందు నుంచే కేంద్రంలోకి అనుమతిస్తాం. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉంటుంది. కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచనల మేరకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరేలా ఆర్టీసీ బస్‌లు నడుపుతారు. ఉదయం పరీక్ష కేంద్రానికి పోలీస్‌స్టేషన్ల నుంచి పేపర్లను ఆయా సెంటర్లకు తరలిస్తాం. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించాం.
ఫ ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం ఫ విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు
‘సాక్షి’తో డీఐఈఓ దస్రూనాయక్
20 మందికి ఒక ఇన్విజిలేటర్..
20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున మొత్తం 28,772 మంది విద్యార్థులకు 1400 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశాం.
ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
Comments
Please login to add a commentAdd a comment