ఫ్రెష్ బైట్స్ ఫ్రూట్ బాక్స్
పండ్ల కోసం మార్కెట్‌కు వెళ్లే పని లేదిక..
సాధారణంగా జనం వారికి అవసరం ఉన్న పండ్లను మాత్రమే కొనుగోలు చేసి తింటుంటారు. ఇక మధ్య తరగతి ప్రజలు ఒకటి, రెండు రకాల పండ్లను మాత్రమే కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడు శివాజీనగర్‌లో వెలసిన స్టాల్‌లో 7 రకాల పదార్థాలతో ఒక ప్యాక్ తయారు చేశారు. అందులో 5 రకాల పండ్లు, ఒక రకం మొలకెత్తిన గింజలు, వెజిటేబుల్ ఉంటాయి. ఈ డబ్బాను రోజూ (ఆదివారం మినహా) ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో (6 నుంచి 8 గంటల వరకు) ఉచితంగా డెలివరీ చేస్తారు. ఇందు కోసం నెలకు రూ.2 వేలు తీసుకుంటున్నారు. తాజా పండ్ల కోసం మార్కెట్‌కు వెళ్లే అవసరం లేకుండా వాటిని మన ఇంటి వద్దకే పంపుతూ.. ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు.
ఇంటి వద్దకే.. పోషకాలు
పండ్ల ముక్కలు మొలకెత్తిన గింజలు,
వెజిటబుల్స్ డోర్ డెలివరీ
ఇద్దరు యువకుల వినూత్న బిజినెస్
ప్రజల ఆహారపు అలవాట్లు మారాయి. తాజా పండ్ల ముక్కలు, మొలకెత్తిన చిరుధాన్యాల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అయితే.. వాటిని కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు వెళ్లాలంటే సమయం దొరకదు. ఒకవేళ వెళ్లినా అన్ని ఒకేచోట లభించవు. ఇలాంటి పరిస్థితుల నుంచి అధిగమించేందుకు నల్లగొండ పట్టణంలో ఒక కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇంటి వద్దకే ఆరోగ్యం అనే భావనతో నల్లగొండలోని శివాజీనగర్‌లో ఫ్రెష్ బైట్స్ ఫ్రూట్ బాక్స్ అనే షాపును ప్రారంభించి.. ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నారు.
ఫ్రెష్ బైట్స్ ఫ్రూట్ బాక్స్
Comments
Please login to add a commentAdd a comment