ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం
నల్లగొండ టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై నిరంతరంగా ఉద్యమిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. శనివారం నల్లగొండలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుందన్నారు. రైతుల, కార్మికుల, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పది సంవత్సరాలుగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు నిర్వహించని కారణంగా ప్రమాదం చోటుచేసుకుందని అభిప్రాయపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 2 నుంచి నెలాఖరు వరకు దశల వారీగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉద్యమిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే చలో హైదరాబాద్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, నాగార్జున, డబ్బికార్ మల్లేష్, ప్రభావతి, సయ్యద్ హాశం పాల్గొన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
Comments
Please login to add a commentAdd a comment