మేళ్లచెరువు: మహాశిరాత్రి సందర్భంగా మేళ్లచెరువు మండల కేంద్రంలోని శివాలయం వద్ద నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. మొదటి బహుమతి ఏపీలోని చిత్తూరు జిల్లా జట్టు, రెండో బహుమతి విజయనగరం జిల్లా జట్టు, మూడో బహుమతి కృష్ణా జిల్లా జట్టు, నాల్గో బహుమతి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జట్లు గెలుచుకున్నాయి. విజేతలకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఐరా రియాల్టీ చైర్మన్ పోశం నర్సిరెడ్డి, వీరారెడ్డి, మాజీ ఎంపీపీ పద్మాసైదేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ పద్మాగోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment