వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు
హుజూర్‌నగర్: వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ సూర్యాపేట జిల్లా ప్రత్యేకాధికారి, చీఫ్ ఇంజనీర్ ఏ. కామేష్ అన్నారు. ఆదివారం హుజూర్‌నగర్ పరిధిలోని అనుములగూడెం సబ్ స్టేషన్, మద్దుమ్‌నగర్‌లోని సింగిల్ ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆయన పరిశీలించి విద్యుత్ వినియోగదారులతో మాట్లాడారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ డివిజన్‌లోని ఆయా గ్రామాల్లో ఉన్న వినియోగదారులతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయించాలన్నారు. 24 గంటల్లో ఎప్పుడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అనంతరం మఠంపల్లి మండలంలోని బక్కమంతులగూడెంలో కొత్తగా నిర్మిస్తున్న సబ్ స్టేషన్‌లో కొత్త బ్రేకర్‌తో కస్తూర్బా స్కూల్ ఫీడర్‌ని చార్జ్ చేసి రఘునాథపాలెం ఫీడర్ మీద ఉన్న అధిక లోడును మళ్లించారు. దీంతో బక్కమంతులగూడెం, పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవకాశం కలిగింది. కార్యక్రమంలో విద్యుత్ డీఈ ఎన్. వెంకటకిష్టయ్య, ఏడీఈలు సక్రునాయక్, నాగిరెడ్డి, ఏఈలు రాంప్రసాద్, హరీష్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ సూర్యాపేట జిల్లా
ప్రత్యేకాధికారి, చీఫ్ ఇంజనీర్ కామేష్
Comments
Please login to add a commentAdd a comment