తాగునీటి ఎద్దడి తలెత్తొద్దు
కేతేపల్లి : వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ ఎన్.ప్రేమ్‌కరణ్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కేతేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాలు అందని ప్రాంతాలను గుర్తించి, తాగునీరు అందేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ప్రైవేట్ బోర్లు అద్దెకు తీసుకోవాలన్నారు. ఉపాధిహామీ పనులకు ప్రతి గ్రామంలో వంద మందికి పైగా కూలీలు హాజరయ్యేలా చూడాలన్నారు. వన నర్సరీలో మొక్కలకు ప్రతి రోజు రెండుసార్లు నీళ్లు అందించటంతో పాటు ఎండ వేడిమి నుండి సంరక్షించేందుకు షేడ్‌నెట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, ఎంపీఓ నాగలక్ష్మి, ఆర్‌డబ్ల్యూస్ ఏఈ సాయికుమార్, వాటర్‌గ్రిడ్ ఏఈ అశోక్, ఈజీఎస్ ఏపీఓ సురేందర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment