నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాక
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకు కనగల్ చేరుకుంటారు.అక్కడ ఇటీవల నిర్మించిన పీహెచ్‌సీ, సెంటర్ ఫర్ లైఫ్ సైన్సెస్, మహీంద్రా యూనివర్సిటీల సహకారంతో చేస్తున్న గ్లకోమా పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ కస్తుర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నల్లగొండ చేరుకుని.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ బయల్దేరి వెళతారు.
ఇసుక అక్రమంగా తరలించొద్దు
● ఎస్పీ శరత్‌చంద్ర పవార్
నార్కట్‌పల్లి : ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ హెచ్చరించారు. మంగళవారం నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో ఇసుల రీచ్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమంగా ఇసుక రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టు ఏర్పాటు చేశామని.. ప్రతి వాహన వివరాలను సేకరించి నోట్ చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారితోపాటు.. వారికి సహకరించిన వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట సీఐ నాగరాజు, ఎస్‌ఐ క్రాంతికుమార్ తదితరులున్నారు.
హ్యాండ్లూమ్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు
నల్లగొండ టూటౌన్ : హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ ఏడీ ద్వారక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు పూర్తి వివరాలకు చేనేత, జౌళి శాఖ కార్యాలయం 9912183164 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
గిరిజన క్రీడా పాఠశాలలో ప్రవేశాలు
నల్లగొండ : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి హైదరాబాద్ బోయిన్‌పల్లి వాటర్ స్పోర్ట్స్ అకాడమీ, పాఠశాలలో ప్రవేశాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎస్‌పి.రాజ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన క్రీడా పాఠశాలల్లో 5వ తరగతిలో 40, 6లో 9, 7లో 10, 8లో 7 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గిరిజన విద్యార్థులు.. కుటుంబ వార్షిక ఆదాయం రూ.20 లక్షలలోపు ఉండాలని ప్రతిభ ఆదారంగా 5వ తరగతిలో 20 మంది గిరిజన బాలబాలికలకు ప్రవేశాలు కల్పిస్తారని, ఆగస్టు 31, 2025 నాటికి 9 నుంచి 11 సంవత్సరాలలోపు వయసు ఉండి 4వ తరగతి చదువుతున్న వారు అర్హులని పేర్కొన్నారు. జిల్లా స్థాయి ఎంపికను ఈ నెల 12న మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహిస్తామని.. వివరాలకు 9966394804 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
డీటీఎఫ్ నూతన
జిల్లా కమిటీ ఎన్నిక
నల్లగొండ : డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా కమిటీని మంగళవారం నల్లగొండలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.వెంకటేశం, ఉపాధ్యక్షులుగా పి.ఏడుకొండలు, ఎం.పుష్పలత, ఎన్.గోపి, ప్రధాన కార్యదర్శిగా పి.వెంకులు, కార్యదర్శులుగా ఎం.నాగయ్య, టి.వెంకటేశ్వర్లు, వై.మోహన్‌రావు, ఇ.జగతి, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం.సోమయ్య, కె.రాహెల్‌కుమారి, ఇ.అంజయ్య, ఎండీ. ఖుర్షిద్‌మియా ఎన్నికయ్యారు.
నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాక
నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాక
Comments
Please login to add a commentAdd a comment